కేంద్ర ప్రజా ప్రభుత్వం మంద కృష్ణకు పద్మశ్రీ పురస్కారం ఇవ్వడం ముదావహం. అంతే కాదు అది ఎంతో సమంజసం. మంద కృష్ణకు అభినందన.
గద్దర్‌కు పద్మశ్రీ రాలేదు. అందువల్ల రచ్చ రేగుతోంది…
ఈ విషయంగా కేంద్ర ప్రజా ప్రభుత్వ మంత్రి బండి సంజయ్ ఇచ్చిన వివరణ సమంజసంగానూ మెదడుతో అర్థం చేసుకోగలిగితే సరిగ్గానూ ఉంది. “గద్దర్‌కు పద్మశ్రీ ఇవ్వకపోవడం సరైందే” అని మతి స్థిమితం ఉన్నవాళ్ల, మామూలు వాళ్ల, మానసిక ఆరోగ్యవంతల మాట. కేంద్ర ప్రజా ప్రభుత్వం తీసుకున్న మంచి, గొప్ప నిర్ణయం గద్దర్‌కు పద్మశ్రీ ఇవ్వకపోవడం. గద్దర్‌కు పద్మశ్రీ ఇవ్వకుండా కేంద్ర ప్రజా ప్రభుత్వం తెలుగు జాతి పరువు కాపాడింది. గద్దర్‌కు పద్మశ్రీ రానందకు సోషల్ మీడియాలోనూ, తెలుగు సమాజంలోనూ పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం ఔతూండడం మనం చూస్తున్నాం.
చదువు, లోక జ్ఞానం, విజ్ఞత, రసజ్ఞత, వాస్తవాలతో గద్దర్ గురించి చర్చించబడితే “అందరూ అరవండి” అంటూ ‘ఓ వీధి జాగిలాల పుత్రుడు’, ఓ అతి నీచపు శాల్తీ ఉసిగోల్పడమూ, ఉస్కో అనంగానే కొందరు జాగిలాల సంతానం, నీచపు శాల్తీలు తమ అసభ్యకరమైన భాషతో, కామెంట్లతో మేం మా తల్లులకు వీధి జాగిలాల సంపర్కంవల్లే పుట్టామని గట్టిగా నిరూపించుకోవడం ఫేస్ బుక్ లో, సోషల్ మీడియాలో ఉన్నదే. గద్దర్ విషయంలో ఉన్మాదుల, చదువు, లోక జ్ఞానం లేనివాళ్ల, సంస్కారం లేనివాళ్ల, అసభ్యకరమైన దూషణలు, ఆగం, సభ్య సమాజానికి అవమానకరం; గర్హనీయం; హానికరం.
గద్దర్ పెద్ద శాతం తెలుగు ప్రజలకు సంబంధించిన వ్యక్తా? బుద్ధితో ఆలోచిస్తే ఎవరికైనా సరైన సమాధానం లభిస్తుంది. ఎందరో మహానుభావులు సాటి మనుషులకు, సమాజానికి తమ ఆస్తులు అమ్మి, తమ రక్తం చింది సాయం, సేవ చేశారు. ఇవాళ కొన్ని యూట్యుబ్ చానళ్ల యాంకర్లు సైతం తమ డబ్బుతో విద్య, ఆహారం నిమిత్తం అవసరమైన వాళ్లకు సాయం చేస్తున్నారు; అనాధ పిల్లలకు బాసటగా నిలుస్తున్నారు. గద్దర్ తన జీవిత కాలంలో సమాజానికో, సగటు మనిషికో చేసిన మేలు ఏదైనా ఉందా? గద్దర్ చేసిన ప్రజా హిత కార్యక్రమాలు ఏవి? ఎన్ని? అసలు గద్దర్ ఈ సమాజానికి ఏమౌతాడు? గద్దర్ గురించిన పలు వాస్తవాలు గత రెండు, మూడు రోజులుగా సోషల్ మీడియా ద్వారా మనకు తెలియవస్తున్నాయి. కొందరు సీనియర్ జర్నలిస్టులు గద్దర్ ధనార్జన గురించి భయాన్ని కలిగించే వాస్తవాలు చెబుతారు. కనీసం ఈ సందర్భంలోనైనా గద్దర్ చేసిన ప్రజా హిత కార్యక్రమాలు ఏవైనా ఉంటే అవి ఈపాటికి అందరికీ తెలిసి ఉండేవి.
గద్దర్‌ను యుద్ధ నౌక అనడం మనకు వినబడుతూంటుంది… గద్దర్ ఎవరి మీద యుద్దం చేశాడు? ప్రభుత్వంతోనా? ప్రజలతోనా? చట్టంతోనా?
సామాజిక అవసరాల కోసమూ, సగటు మనిషి ప్రయోజనాల కోసమూ గద్దర్ యుద్దం చేశాడా? గద్దర్ చేసిన యుద్ధంలో గద్దర్ గెలిచాడా? ఓడాడా? గద్దర్ గెలిస్తే ఆ గెలుపు వల్ల ప్రజలకు జరిగిన మేలు ఏమిటి? గద్దర్ ఓడిపోయి ఉంటే అతడు విఫలుడయ్యాడనే కదా? గద్దర్ ఓడిపోవడమే కె.ఎ. పాల్ పార్టీలో చేరడమా? భక్తి పాటలు పాడడమా? గద్దర్ దేశ చట్టాలను వ్యతిరేకించిన వ్యక్తిగా అడవుల్లో జీవించడం తెలిసిందే. గద్దర్ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పని చేశాడని అందరికీ తెలిసిందే. అయినా ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం ఆశించడం ఏమిటి? సమాజంలోని కొన్ని వర్గాల ప్రజలపై గద్దర్ విషాన్ని, విద్వేషాన్ని వెళ్లగక్కడం తెలిసిందే. గద్దర్ ఏయే వర్గాలపై విషం, విద్వేషం వెళ్లగక్కాడో ఆయా వర్గాల్లోని పలువురు మహనీయులు నిమ్న వర్గాల పురోగతికి ఎంతో కృషి చేశారు. గద్దర్ నిమ్న వర్గాల పురోగతికి చేసిన కృషి ఎంత? ఏమిటి? అజ్ఞానం కాదు, ఉన్మాదం కాదు, అసభ్యత కాదు, దుర్భాష కాదు, దాడి చెయ్యడం కాదు గద్దర్ చేసిన మేలు, మంచి, హితం, అర్హత అన్నవి అసలు ఉండి ఉంటే అవి చెప్పబడాలి.
గద్దర్ ప్రజా గాయకుడా? గద్దర్ ఏ ప్రజల గాయకుడు? అసలు ప్రజా గాయకుడంటే ఎవరు? ఎవరు ప్రజా గాయకుడు అవుతారు? పెద్ద శాతం ప్రజల అభిమాన గాయకుడూ, పెద్దగా ప్రజల్లో ఉన్న గాయకుడూ ప్రజా గాయకుడు అవుతాడు. ప్రజలకు పట్టని గాయకుడు, ప్రజల్లో లేని గాయకుడు, పెద్ద శాతం ప్రజలు పరిగణించని గాయకుడు ప్రజా గాయకుడు అవడు. మనం ఆలోచిద్దాం… మన కుటుంబాల్లో, మన మిత్ర, బంధు వర్గాల్లో, మన పేటలో, మన ఊళ్లో ఎంత మందికి గద్దర్ ఒక గాయకుడుగా నచ్చుతాడు? తెలుగుకు సంబంధించినంత వరకూ ఘంటసాల, ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం మాత్రమే ప్రజా గాయకులు ఔతారు. ఇది మెదడు ఉన్న ఎవరికైనా తెలిసిన విషయమే. ఇవాళ టీ.వీ. కార్యక్రమాల్లో పాడే గాయకులకు ఉన్న ప్రజాదరణ అయినా గద్దర్‌కు ఉందా?
ఒక వర్గానికి సంబంధించిన మూసలో లేదా ఒక కళా రూపంలోగద్దర్ పాడడం ప్రజ మొత్తానికి సంబంధించిన గానం అవుతుందా? గద్దర్ గానం పెద్దశాతం ప్రజల గానం, పెద్ద శాతం ప్రజల అభిమాన గానం కాలేదు; కాదు.
ఒక వర్గానికి సంబంధించిన మూసలో లేదా ఒక కళా రూపంలోగద్దర్ పాడడం ప్రజ మొత్తానికి సంబంధించిన గానం అవుతుందా? గద్దర్ గానం పెద్దశాతం ప్రజల గానం, పెద్ద శాతం ప్రజల అభిమాన గానం కాలేదు; కాదు.
ప్రజా గాయకుడు అవడం తరువాత గానకళ పరంగా గద్దర్ అసలు ఒక గాయకుడేనా? అంతర్జాతీయంగా కొన్ని పదుల దేశాల కళాకారుల గానంతో నాకు పరిచయం ఉంది . ఆఫ్రికా దేశాల నల్ల జాతీయుల గానం కూడా నాకు తెలుసు. ప్రపంచంలో ఏ గాయకుడైనా గాయకుడున్న ఏ వ్యక్తైనా శ్రుతి, తాళంలోనే, గాత్ర శుద్ధితోనే పాడతాడు. గద్దర్ గానంలో ఆ శ్రుతి, తాళం ఉండవు. అసలు గద్దర్ గాత్రమే సరైంది కాదు. చదువు, లోక జ్ఞానం, తెలివిడి, మతిస్థిమితం ఉన్న ఎవరికైనా ఈ ప్రాథమిక అంశాలు తెలుస్తాయి! మన దేశంలో ఏ భాషలోనూ, ఏ ప్రాంతంలోనూ గద్దర్‌లా పాడే వ్యక్తి ప్రజా గాయకుడు అని అనిపించుకోలేదు. గద్దర్ ప్రజా గాయకుడు అని వినబడుతూండడం తెలుగుకు మాత్రమే కలిగిన దుస్థితి.
అసలు గద్దర్‌కు తెలుగు ప్రజల్లో ఉన్న స్థానం ఏమిటి? ఇతర ప్రాంతాల సంగతి తరువాత తెలంగాణ ప్రజల్లోనైనా గద్దర్ స్థానం ఏమిటి? స్వయంగా గద్దర్ కూతురు కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోవడం గద్దర్‌కు ఆ ప్రాంతం
ప్రజల్లోనే ఆదరణ, స్థానం లేవు అన్న క్షేత్ర వాస్తవాన్ని గట్టిగా తెలియజేస్తోంది. గద్దర్ వాదులు, గద్దర్ ఉన్మాదులు ఈ పరిణామానికి సిగ్గుపడాలి. గద్దర్ నిజంగా ప్రజలకు సంబంధించిన వ్యక్తే, ప్రజా గాయకుడే అయుంటే ఆతడి కూతురు ఎన్నికల్లో గెలిచి ఉండేది. ఎన్నికలకు వ్యతిరేకమైన గద్దర్ ఒక దశలో ఎన్నికల్లో పోటీ చేస్తానని బీరాలు పలికి తెలివిగా బరిలోకి దిగలేదు. ప్రజల్లో తన స్థానం ఏమిటో గద్దర్‌కే బాగా తెలిసి ఉంటుంది. అందువల్లే రాజకీయ పార్టీలో చేరినా ఎన్నికల్లో పోటీ చెయ్యలేదు.
గద్దర్‌పై ఉన్న క్రిమినల్ కేసులు, అతడి నక్సల్ జీవితం, అతడు దేశ ప్రజాస్వామ్యన్ని ధిక్కరించడం, అతడు ఎన్నికల్ని, పార్లమెంటును ధిక్కరించడం, అతడు కె.ఎ. పాల్ పార్టీలో చేరడం, అతడు భక్తి పాటలు పాడడం… ఇలా అన్నీ అందరికీ తెలిసినవే… ఇవన్నీ తెలిశాక కూడా అతడికి పద్మశ్రీ రావాలనుకోవడమూ, అతడికి పద్మశ్రీ ఇవ్వనందుకు కేంద్ర ప్రజా ప్రభుత్వాన్ని నిందించడమూ దేన్ని సూచిస్తోంది? పెద్ద శాతం ప్రజకూ, కళకూ, సామాజిక సేవకు, ప్రజా హితానికి చెందని గద్దర్ వంటి వ్యక్తికి పద్మశ్రీ రావాలనుకోవడం ఘోరం ఔతుందా? నీచం ఔతుందా? దారుణం ఔతుందా? ఉన్మాదం ఔతుందా?
ఇలాంటి పరిస్థితి ఒక్క తెలుగులో మాత్రమే ఉంది. ఇతర భాషల్లో లేదు; రాదు.
గద్దర్‌పై ప్రభుత్వం ఎందుకు కాల్పులు జరిపింది? నక్సలైట్ ఐనందువల్ల కాదా? ఒక నక్సలైట్ ప్రజా కళాకారుడు, ప్రజా హితుడు ఔతాడా లేదా ప్రజా కంటకుడు, ప్రభుత్వ కంటకుడు ఔతాడా? గద్దర్ ప్రజల వ్యక్తా? ప్రజా కంటకుడా? గద్దర్ విషయంగా రచ్చ చేస్తున్నవాళ్లు గద్దర్ విషయంలో ఆలోచన కలిగించే ప్రయత్నం చేస్తున్న వాళ్లను దూషించే అమానవీయ శక్తులు తమ కొడుకులు గద్దర్‌లా బతికేందుకు ఒప్పుకుంటారా? గద్దర్ అభిమానులు తమ కొడుకుల్ని గద్దర్‌లా తీర్చిదిద్దేందుకు సిద్ధపడాలి.
ఈ నా మాటలపై కూడా వీధి జాగిలల సంతానమైన, జుగుప్సాకరమైన ఏదో శాల్తీ లేదా కొన్ని వికృత జీవులు నాపై ‘అందరూ అరవండి” అని అంటూ ఫేస్ బుక్ లో పోస్టులు పెట్టనూ వచ్చు, అరవమనంగానే తాము వీధి జాగిలాల, మల వరాహాల సంతానమే అని గట్టిగా తెలియజేసేందుకు నా విషయంలో వికృతంగా అసభ్యకరమైన భాషను వాడనూ వచ్చు. అదే జరిగితే ఒక అసభ్యకరమైన వర్గం కొన్ని తరాలుగా చదువు, సంస్కారం లేకుండా జుగుప్సాకరమైన వర్గంగానే, సమాజం చేత అసహ్యించుకోబడుతున్న వర్గంగానే ఎందుకు ఉండిపోయిందో సంఘానికి మరోసారీ తెలియవస్తుంది.
నీచులకు, అసాంఘీక శక్తులకు, వికృత జీవులకు, అసభ్యకరమైన భాషకు అతీతంగా చదువు, విజ్ఞత, వాస్తవాలు, సంస్కారం, సభ్యత, ప్రజాభీష్టం, ప్రజా ప్రభుత్వం పని చేస్తూ కొనసాగుతూనే ఉంటాయి.
గద్దర్‌కు పద్మశ్రీ పురస్కారం ఇవ్వకుండా చదువు, కళ, సంస్కారం, విజ్ఞత, సభ్య సమాజం, నాణ్యత వీటి తరపున నిలబడి దేశం మొత్తానికి సరైన సందేశం ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రజా ప్రభుత్వ మంత్రి బండి సంజయ్ గారికి అభినందన!
కృతజ్జత!!







