Mahaa Daily Exclusive

  సినీ పరిశ్రమ ఏపీకి తరలిరావాలి: మంత్రి కందుల

Share

రాష్ట్ర సినిమాటోగ్రఫి మంత్రి కందుల దుర్గేష్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌ నుంచి సినీ పరిశ్రమ ఏపీకి తరలిరావాలని ఆదివారం పిలుపునిచ్చారు. స్టూడియోల నిర్మాణం, డబ్బింగ్‌ థియేటర్స్‌ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం తరఫున రాయితీతో కూడిన స్థలాలను కేటాయిస్తామని దుర్గేష్ వెల్లడించారు. సినిమాలు నిర్మించే సంస్థలకు రాయితీలు ఇస్తామని తెలిపారు. ప్రస్తుతం మంత్రి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.