Mahaa Daily Exclusive

  స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నిమ్మల..!

Share

సీఎం చంద్రబాబు పిలుపు మేరకు స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో పంట కాలువల వెంబడి ఉన్న చెత్తా చెదారాలను పారతో తొలగించి.. స్వయంగా డబ్బాలతో మోసుకెళ్లి ట్రాక్టర్‌లో పోశారు. పారిశుద్ధ్య కార్మికులతో పోటీపడి మరీ చెత్తను తొలగించారు. స్వచ్ఛ ఆంధ్ర లక్ష్యంగా ప్రతి నెలా మూడో శనివారం ఈ కార్యక్రమం చేపడుతున్నామని మంత్రి నిమ్మల తెలిపారు.