Mahaa Daily Exclusive

  జమ్మూకశ్మీర్‌లో ఇటీవలి కాలంలో అతిపెద్ద ఉగ్ర ఘటన ఇదే: సీఎం ఒమర్‌ అబ్దుల్లా

Share

జమ్మూకశ్మీర్ పహల్గామ్‌లో పర్యాటకులపై మంగళవారం జరిగిన ఉగ్రవాద దాడిని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా ఖండించారు. ఈ ఉగ్రదాడిని “హేయమైన, అత్యంత దారుణమైన అమానవీయ చర్య” అని ఆయన అభివర్ణించారు. “పహల్గామ్ దాడి వార్త విని నేను నమ్మలేనంతగా షాక్ అయ్యాను. ఇటీవలి కాలంలో జమ్మూకశ్మీర్‌లో జరిగిన అతిపెద్ద ఉగ్ర ఘటన ఇదే. ఈ దాడిని ఖండించడానికి మాటలు సరిపోవు” అని ఆయన అన్నారు.