Mahaa Daily Exclusive

  ఉగ్రదాడి ఘటన తీవ్ర ఆవేదనకు గురిచేసింది: సీఎం చంద్రబాబు

Share

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో అమాయకులైన పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి ఘటన తీవ్ర ఆవేదనకు గురిచేసిందని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ మేరకు చంద్రబాబు మంగళవారం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఉగ్రమూకల పాశవిక ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ దాడిలో బాధిత కుటుంబాలకు సీఎం చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని సీఎం చంద్రబాబు ప్రార్థించారు.