శాయంపేట, మహా
బీఆర్ఎస్ పార్టీ ఆదివారం నిర్వహించిన సభ రజతోత్సవం కాదని రైతు విధ్వంసమని, సభ పేరుతో రైతుల భూములపై గులాబీ పింకీలు విధ్వంసం సృష్టించారని శాయంపేట మండల కాంగ్రెస్ మండల యూత్ అధ్యక్షులు సాదు నాగరాజు అన్నారు.మంగళ వారం మండల కేంద్రంలో మహా పత్రిక ప్రతినిధి తో ఆయన మాట్లాడుతూ ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ నిర్వహించిన రజతోత్సవ సభ కారణంగా వ్యవసాయానికి పనికి రాకుండా వ్యవసాయ భూములలో ఎర్రమన్నుతో సభా ప్రాంగణమంతా నింపడం,పొలానికి-పొలానికి మధ్య గెట్లు ధ్వంసం చేయడం వలన రైతుల మధ్య గెట్ల పంచాయతీలు ఏర్పడే అవకాశం ఉందన్నారు.అదేవిధంగా పొలాలకు నీరంందించే సాగునీటి కాలువలలో మన్ను మొరం, రాళ్లతో నింపి దారిని ఏర్పాటు చేయడం వలన జంతువులకు, రైతులకు నీళ్లు కరువు ఏర్పడుతుందన్నారు.ఎన్నో ఏళ్లుగా రైతులకు ఎండాకాలం, వర్షాకాలం నిలువ నీడనిచ్చిన చెట్లను కూల్చి పార్కింగ్ ఏర్పాటు చేసి రైతులకు నిలువ నీడ లేకుండా చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. గత వారం రోజులుగా నాయకులు, కార్యకర్తలు పొలాల్లో మందు సిట్టింగులు ఏర్పాటు చేసి బీర్లు, బ్రాండీ తాగి సీసాలను ఆ పోలాల్లోనే పగలగొట్టడం వలన పగిలిన మందు బాటిల్లతో రైతులకు ప్రమాదం వాటిల్లుతుందని అన్నారు. రజతోత్సవం సభ పేరుతో మొత్తం అడవిని నరకడంతో పాములు,తేల్లు పక్కన ఉన్న గ్రామాల్లోకి వెళ్లడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారన్నారనీ,రాత్రిపూట గ్రామాల్లోకి వచ్చిన నెమళ్ల అరుపులతో ప్రజలకు నిద్ర కరువవుతుందన్నారు.డోజర్ లతో, రోడ్డు రోలర్లతో పొలాలను చదును చేయడం మూలంగా కరెంటు స్తంభాలు దెబ్బతిన్నాయని,బోర్లు, కరెంట్ వైర్లు మట్టి దిబ్బలుగా పొలాల్లో కలిశాయని ఆందోళన వ్యక్తం చేశారు.







