షాద్ నగర్ ,మహా:గుర్తుతెలియని వాహనం ఢీకొని అడవి జంతువు నక్కకు తీవ్ర గాయాలైన సంఘటన రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కేంద్రంలో చోటు చేసుకుంది. ఫారెస్ట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం… రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం పరిధి కేశంపేట మండల కేంద్రం వద్ద ఉన్న రైతు వేదిక సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని నక్కకు తీవ్ర గాయాలు అయినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. చికిత్స నిమిత్తం ఆమనగల్ వెటర్నరీ హాస్పిటల్ కు తరలించి మెరుగైన వైద్యం అందజేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Post Views: 20







