Mahaa Daily Exclusive

  తాగునీటి సమస్యకు ఆర్థిక సహాయం కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కొండా వీరాభిమాని కోడం శివ కృష్ణ…!

Share

వరంగల్ తూర్పు నియోజకవర్గం
33వ డివిజన్ లోని కాలనీలో గత కొన్ని సంవత్సరాలుగా కాలనీవాసులు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొండా వీరాభిమాని కోడం శివకృష్ణ దృష్టికి తీసుకురాగా మంచి నీటి సమస్యను పరిష్కరించడానికి కోడం శివ కృష్ణ ముందుకు వచ్చి మానవతా హృదయంతో కాలనీకి వెళ్ళవలసిన పైప్ లైన్ మెటీరియల్ కోసం తన వంతు ఆర్థిక సహాయంగా 15,000 రూపాయలు కాలనీ వాసులకు అందజేశారు. ఇందుకు కాలనీ వాసులు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ముష్క మల్ల సుధాకర్, కత్తెరశాల శ్రీధర్, హుస్సేన్, ప్రతాప్, ముఖ్య నాయకులు, కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.