రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
పరిగి నియోజకవర్గం రైతుల ఆర్థిక అవసరాలను తీర్చేందుకు, గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలను మరింత విస్తరించే లక్ష్యంతో ది హైదరాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్ (డీసీసీబీ) నూతన బ్రాంచ్ ను పూడూర్ మండలం, మన్నెగూడలో ఏర్పాటు చేసారు. ఈ శాఖను పరిగి శాసనసభ్యులు టీ రామ్మోహన్ రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్యతో కలిసి నూతన బ్యాంకును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్లు పట్లోళ్ల అంజి రెడ్డి, కిషన్ నాయక్, మొగులయ్య, బ్యాంక్ సీఈఓ భాస్కర సుబ్రహ్మణ్యం, జీఎంలు ఫణి రామ్, ప్రభాకర్ రెడ్డి, పూడూర్ సొసైటీ చైర్మన సతీష్ రెడ్డి రెడ్డి, గండీడ్ సొసైటీ చైర్మన్ లక్ష్మినారాయణ్ రెడ్డి, మాజీ ప్రజాప్రతినిధులు, ప్రాంతీయ రాజకీయ నాయకులు, రైతు సంఘాల నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 27







