విశాఖ ,భీమిలి ,మహా :
భీమిలి నియోజకవర్గ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు యువ నాయకులు గంటా రవితేజ గురువారం 5వ వార్డు మారికవలస తుఫాన్ షెల్టర్ బిల్డింగ్ లో ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ వారికి స్థిర జీవనోపాధి కొరకు కుట్టు శిక్షణా కేంద్రం ప్రారంభించారు.
ఈ సందర్భంగా గంటా రవితేజ మాట్లాడుతూ సమాజంలో ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ వారికి కూడా వారి జీవనోపాధి మెరుగుపరిచి సమాజంలో వారికి సమాన హక్కు కల్పించే విధంగా ఈ శిక్షణా కేంద్రం ప్రారంభించడం జరిగిందని, ఇదే స్ఫూర్తితో అన్ని రంగాల్లో వారు శిక్షణ పొంది జీవనోపాధే కాకుండా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో 5వ వార్డు కార్పొరేటర్ మొల్లి హేమలత, నాయకులు మొల్లి రమణ, 5వ వార్డు ,కార్యదర్శి ఈగల రవికుమార్ మరియు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Post Views: 61








