Mahaa Daily Exclusive

  టీడీపీని స్థాపించిన ముహూర్త బలం గొప్పది: మంత్రి లోకేశ్

Share

AP: స్వర్గీయ ఎన్టీఆర్ టీడీపీని స్థాపించిన ముహూర్త బలం గొప్పదని మంత్రి నారా లోకేశ్ అన్నారు. మంగళవారం నుంచి 3 రోజులపాటు కడపలో మహానాడు కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో ఆయన ఓ వీడియోను ఎక్స్‌లో షేర్ చేశారు. కార్యకర్తలే టీడీపీకి బలమని, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎత్తిన పసుపు జెండాను దించకుండా పోరాడే కార్యకర్తలే తనకు స్ఫూర్తి అని అన్నారు. మహానాడుకు అందరినీ స్వాగతించారు.