మహా
భారత్, సైప్రస్‌కు అత్యంత విశ్వసనీయ దేశమని ప్రధాని మోదీ అన్నారు. ఆ దేశంలో పర్యటిస్తున్న ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సైప్రస్‌కు యూరోపియన్ యూనియన్ అధ్యక్ష పదవి అవకాశం రావడంపై శుభాకాంక్షలు తెలిపారు. సైప్రస్ నాయకత్వంలో ఈయూతో మరింత మెరుగైన సంబంధాలు ఏర్పడతాయని అన్నారు. భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కోసం సైప్రస్, యూరోపియన్ యూనియన్ మద్దతు సాధిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.
సైప్రస్ అధ్యక్షుడిని భారత్ పర్యటనకు ఆహ్వానిస్తున్నట్లు మోదీ చెప్పారు. వీలైనంత త్వరగా భారత్‌కు రావాలని కోరుకుంటున్నామని అన్నారు. సైప్రస్ నాయకత్వంలో భారత్, మధ్యప్రాచ్యం, ఈయూ మధ్య వ్యాపార సంబంధాలు మెరుగుపడతాయని భారత్ ఆశిస్తోందని పేర్కొన్నారు. ఇది యుద్ధాల కాలం కాదు, చర్చలతోనే పరిష్కారాలు లభిస్తాయమని ఉద్ఘాటించారు.
Post Views: 79








