Mahaa Daily Exclusive

  యోగ సాధనతో సంపూర్ణ ఆరోగ్యం ఇషా ఫౌండేషన్ యోగ మాస్టర్ అభిషేక్ మౌర్య..!

Share

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
యోగ సాధన తో సంపూర్ణ ఆరోగ్యము సాధ్యమని ఇషా ఫౌండేషన్ యోగ మాస్టర్ అభిషేక్ మౌర్య అన్నారు. బుధవారం ఆమనగల్ పట్టణ కేంద్రంలోని అరబిందో ఉన్నత పాఠశాలలో, పాఠశాల అకాడమిక్ అడ్వైజర్ సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో యోగ పై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆధునిక జీవనశైలితో ప్రస్తుతము ప్రజలు అనేక మానసిక శారీరక రుగ్మతలకు గురవుతున్నారన్నారు. యోగ ధ్యానం సాధనం చేయడం ద్వారా వీటిని దూరం చేయవచ్చు అన్నారు. యోగ మాస్టర్ అభిషేక్ మౌర్య విద్యార్థులచే సుమారు రెండు గంటలపాటు యోగాసనాలు సాధన చేయించారు. ప్రతిరోజు ఒక గంట సాధనం చేయడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు నాగమణి, గాయత్రి, నరేష్, భాస్కర్, నజీర్, శ్రీను, సునీత, రాధా, అరుణ, అజిత్, రతీష్, రఘు తదితరులు పాల్గొన్నారు

Latest