రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
జై బావు, జై భీం, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా, రేపు హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుల సమ్మేళనానికి, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే హజరుకానున్నరని, సభకు గ్రామస్థాయి నుండి కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చి సభను జయపద్రం చేయాలని పీసీసీ సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. బుధవారం మండల కేంద్రంలో డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్ రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి నేనావత్ భీక్య నాయక్ మరియు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ… రాష్ట్రంలో గ్రామ స్థాయి నుండి కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి సభను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులతో ఖర్గే మాట్లాడటం జరుగుతుందని, ఇదీ చరిత్రలో ఒక గొప్ప సమావేశమని పేర్కొన్నారు. క్షేత్ర స్థాయిల్లో పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలతో మాట్లాడనున్నారని తెలిపారు. పార్టీని సంస్థగతంగా మరింత బలోపేతం చేసి, ఎలా ముందకు తీసుకువెళ్లాలని, అందుకు తీసుకోవల్సిన చర్యలపై పార్టీ శ్రేణలకు, ఖర్గే దిశా నిర్దేశం చేయనున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పధకాల తీరు తెన్నులపై పార్టీ శ్రేణులతో చర్చించడంతో పాటు, ప్రజా సంక్షేమ పథకాలను ఏ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలి తదితర అంశాలపై పార్టీ శ్రేణులకు సూచనలు, సలహాలు అందించనున్నట్లు తెలిపారు. సమావేశానికి పెద్ద సంఖ్యలోతరలివచ్చి విజయవంతం చేయాలని, ఖర్గే సందేశాన్ని ప్రజలకు చేరవేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సింగిల్విండో డైరెక్టర్ వెంకటేశ్, నాయకులు జాంగిర్, జహంగీర్ బాబా, శంకర్, జగన్, రామకృష్ణ, యాదయ్యగౌడ్, రాజేందర్, శేఖర్ గౌడ్, రాజునాయక్ తదితరులు పాల్గొన్నారు.







