Mahaa Daily Exclusive

  సిఏలకు, వైద్యులకు వాసవి క్లబ్ సత్కారం ..!

Share

మంచిర్యాల, మహా : జాతీయ వైద్యులు, చార్టర్డ్ ఎకౌంటెంట్ల దినోత్సవం సందర్భంగా మంచిర్యాల వాసవిక్లబ్స్ ఆధ్వర్యంలో పలువురు సిఏలను, వైద్యులను మంచిర్యాల వానవిక్లబ్, వనితాక్లబ్, కపుల్స్ క్లబ్, టీచర్స్ క్లబ్, బిజోన్ క్లబ్ బాధ్యులు సంయుక్తంగా హైటెక్ సిటిలోని కొంకుముట్టి వెంకటేశ్ నివాసంలో సత్కరించారు.
ఈ సందర్భంగా సత్కారం పొందిన సిఎలు గడ్డం సూర్యప్రకాష్, రాచర్ల సాయిచరణ్, కొంకుముట్టి సాయప్రణీత్ లు మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థలో సిఎ పాత్ర కీలకమైందని అన్నారు. అలాగే సత్కారం పొందిన వైద్యులు డాక్టర్ నలుమాను శ్రీదేవి, నలుమాను శ్రీనివాస్, తాటిపెల్లి శ్రీధర్, జైన రామకృష్ణ, జైన సరిత, గోలి వూర్ణచందర్, రావికంటి వంశీకృష్ణ రావికంటి పవిత్ర, కండె కృష్ణ, చీకోటి శ్రీకాంత్, నిషాంత్లు మాట్లాడుతూ, నేటి సమాజంలో ఆహర అలవాట్లను మార్చుకుని ఎప్పటికప్పుడు కాలానుగుణంగా ఆరోగ్య రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. మంచిర్యాలలో త్వరలో వాసవిక్లబ్స్ ఆధ్వర్యంలో మెగా వైద్యశిబిరంను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమాలలో వాసవిక్లబ్ జిల్లా క్యాబినెట్ సెక్రటరి సేవా కొంకుముట్టి వెంకటేశ్, వైఎస్ గవర్నర్ వుల్లూరి బాలమోహన్, అంతర్జాతీయ ప్రోగ్రాం కోఆర్డినేటర్ డొంతుల ముఖేష్, రీజియన్ ఛైర్మన్ కేశెట్టి వంశీకృష్ణ, సెక్రటరి నలుమాసు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Latest