Mahaa Daily Exclusive

  ఎస్సీ, ఎస్టీల అభ్యునతికి పాటుపడాలి – జిల్లా కలెక్టర్ రాజర్శి షా..!

Share

ఆదిలాబాద్, మహా

జిల్లాలో నూతనంగా నియమితులైన ఎస్సీ, ఎస్టీ కమిటి సభ్యులు ప్రతి నిత్యం గ్రామాల్లో పర్యటిస్తూ వారి అభ్యున్నతికి పాటు పడాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి విభాగం, పీసిఆర్ చట్టం, పీఓ ఏ చట్టం అమలుపై బుధవారం ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి నిఘా, పర్యవేక్షణ కమిటి సమావేశంలో ఎస్పీ అఖిల్ మహాజన్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాక్ట్ కు సంబంధించిన అంశాలపై నూతన కమిటి సభ్యులకు విస్తృత సూచనలు చేశారు. కమిటి నూతన సభ్యులుగా శశికాంత్, లక్ష్మీకాంత్, ఉషారాణి, జంగు బాపు, శ్యామల నియమితులు కాగా వారికి అభినందనలు తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన సభ్యుల పదవి కాలం రెండు సంవత్సరాలు ఉంటుందన్నారు. నిరంతరం గ్రామాల్లో పర్యటించి ఎస్సీ, ఎస్టీల సమాజానికి మంచి చేసేలా కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొన్నారు. ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కృషి చేయాలని తెలిపారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ నూతన కమిటి సభ్యులు చురుకుగా పనిచేయాలని, ఎస్సీ ఎస్టీ చట్టాల పై ప్రజల్లో అవగాహన కల్పించాలని అన్నారు. ప్రభుత్వ పథకాలలో ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యతనిస్తూ సహాయ సహకారాలు అందిస్తున్న కలెక్టర్ ను అభినందించారు. అందరి సమన్వయం తో ప్రభుత్వ ఫలాలు అందేలా కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశం లో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ట్రైనీ కలెక్టర్ సలోని చబ్రా, సబ్ కలెక్టర్ యువరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Latest