హన్మకొండ మహా;
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో దొంగిలించబడిన 10 ద్విచక్ర వాహనాలను సంబంధిత బాధితులకు అప్పగించిన హన్మకొండ ట్రాఫిక్ పోలీసులు.
హనుమకొండ ట్రాఫిక్ పోలీసులు రోజు వారీ వాహన తనిఖీల్లో భాగంగా క్షుణ్ణంగా 2024 డిసెంబర్ నెల నుంచి ఇప్పటివరకు దొంగిలించి నడుపుతున్న 10 మోటార్ సైకిళ్లను రికవరీ చేసి, వాటి అసలు యజమానులకు ( బాధితులకు) అప్పగించారు. గురువారం అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ ట్రాఫిక్ రాయల ప్రభాకర్ రావు చేతుల మీదుగా భూపాలపల్లి, మహబూబాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లా, గోదావరిఖని, కరీంనగర్ 1టౌన్ , తో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో కేసులు నమోదు చేశారు. కాగా ఇందుకు సంబంధించిన 10 ద్విచక్రవాహనాలను ఆయా వాహన యజమానులకు అప్పగించారు.
వాహనాల తో పాటు దొరికిన నేరస్తులను సంబంధిత పోలీస్ వారికి అప్పగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వరంగల్ ట్రాఫిక్ ఏసిపి టి సత్యనారాయణ, హన్మకొండ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సీతారెడ్డి, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.








