వరంగల్ మహా;
జూలై 4న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరుగనున్న ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభను విజయవంతం చేయాలని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు.
గురువారం పరకాల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు పరకాల మండలం పట్టణం,నడికూడ మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యుల సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావేశంలో పరిశీలకులుగా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు చీట్ల సత్యనారాయణ,రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి మోత్కూరి ధర్మారావు, భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు అయిత ప్రకాష్ రెడ్డి తో కలిసి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
జూలై 4న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరుగనున్న ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ గ్రామ మండల అధ్యక్షుల ఆత్మీయ సమ్మేళన బహిరంగ సభలో పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అత్యధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
దేశంలోనే తొలిసారిగా గ్రామస్థాయి కాంగ్రెస్ అధ్యక్షులతో ఏఐసిసి అధ్యక్షుడు నేరుగా సమావేశం కానుండడం ఎంతో విశిష్టమైన ఘటనగా అని అన్నారు.సభకు హాజరయ్యే గ్రామ, మండల, నాయకులు సమన్వయంతో ముందుగానే రావాలని సూచించారు.రాబోయే స్థానిక సంస్థలు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.








