Mahaa Daily Exclusive

  రేషన్ కార్డ్ ల వెరిఫికేషన్ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించండి బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ ..!

Share

వరంగల్ మహా;

రేషన్ కార్డ్ ల వెరిఫికేషన్ ప్రక్రియ ను పకడ్బందీగా నిర్వహించాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. గురువారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని మేయర్ కాన్ఫరెన్స్ హాల్లో రేషన్ కార్డ్ వెరిఫికేషన్ అధికారులు, ఆర్ ఐ లు, ఆర్ ఓ లతో రేషన్ కార్డ్ వెరిఫికేషన్ ప్రక్రియ పురోగతిని కమిషనర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ బల్దియా పరిధి లో వరంగల్ జిల్లా కు సంబంధించి కొత్త రేషన్ కార్డుల కోసం 12,200 దరఖాస్తులు, అలాగే హనుమకొండ జిల్లా కు సంబంధించి 16,700 కొత్త రేషన్ కార్డు ల కోసం దరఖాస్తులు రావడం జరిగిందని, వరంగల్ జిల్లా పరిధిలో ఇప్పటికే 50% వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి అయిందని, మిగతా దరఖాస్తుల వెరిఫికేషన్ ప్రక్రియను ఈనెల 10 లోగా పూర్తి చేయాలని, ఇందుకోసం వెరిఫికేషన్ అధికారులు ఉదయం నుండి క్షేత్రస్థాయిలో పని చేయాలని వీటితో సమాంతరంగా ఇందిరమ్మ ఇళ్లకు మార్కింగ్ ఇవ్వడం తో పాటు రెగ్యులర్ విధులను కూడా నిర్వహించాలని అన్నారు. ఆర్ ఓ లు ఆర్ ఐ లు నిరంతరం ఈ ప్రక్రియను పర్యవేక్షించాలని ఏవైనా సాంకేతిక సమస్యలు ఉత్పన్నమైతే డి ఎస్ డి ఓ సాంకేతిక సిబ్బంది సహకారంతో సమస్యలను పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి కిష్టయ్య,
డిప్యూటీ కమిషనర్లు రవీందర్ ప్రసన్న రాణి ఆర్ ఓ లు యూసుఫొద్దిన్
షహజాది బేగం, టి ఎం సి రమేష్ కమ్యూనిటీ ఆర్గనైజర్ లు తదితరులు, పాల్గొన్నారు.

Latest