రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
పెండింగ్ లో ఉన్న ఎనిమిది వేల కోట్ల స్కాలర్షిప్, ఫీ రీయంబర్సుమెంట్ ను వెంటనే విడుదల చెయ్యాలని కడ్తాల్ తహసీల్దారికి ఏబీవీపీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. గురువారం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కడ్తాల్ శాఖ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న 8 వేల కోట్ల స్కాలర్షిప్ , ఫీ రీయంబర్సుమెంట్ ను వెంటనే విడుదల చెయ్యాలని కడ్తాల్ తహసిల్ధార్ ముంతాజ్ కు వినతి పత్రం అందించడం జరిగింది. ఈ సందర్బంగా ఏబీవీపీ రాష్ట్ర నాయకులు క్యామ శ్రీకాంత్ మాట్లాడుతూ… గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రభుత్వం విద్యార్థులకు స్కాలర్షిప్ లను, ఫీ రేయంబర్సుమెంట్ విడుదల చెయ్యడం లేదు. పేద, మధ్యతరగతి విద్యార్థులు స్కాలర్షిప్, ఫీ రీయంబర్సుమెంట్ పైన ఆధార పడి చదువుకుంటున్నారు. వారికి సకాలంలో స్కాలర్షిప్, ఫీ రీయంబర్సుమెంట్ అందక చదువుకు దూరం అవుతున్నారు. కళాశాలలో ఫీజు కడితేనే పరీక్షలకు అనుమతిస్తున్నారు. ఫీజులు కట్టలేక విద్యార్థులు మానసికంగా కుంగిపోతున్నారు. ఫీజు కట్టని విద్యార్థులకు సర్టిఫికెట్స్ ఇవ్వడం లేదు దానితో వారు ఉన్నత చదువులకు దూరం అవుతున్నారు. ఇప్పటికి అయినా ప్రభుత్వం మేల్కొని వెంటనే బకాయిలో ఉన్న స్కాలర్షిప్, ఫీ రీయంబర్సుమెంట్ ను వెంటనే విడుదల చెయ్యాలని అన్నారు. లేని పక్షంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. వినతి పత్రం అందించిన వారిలో నగర కార్యదర్శి పవన్ నాయకులు రమేష్, సందీప్, హరీష్ గౌడ్, హేమంత్, విష్ణు పాల్గొన్నారు.








