భూపాలపల్లి, మహా :
రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులను నియంత్రించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ధర్మ సమాజ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తూరు రవీందర్ డిమాండ్ చేశారు.
భూపాలపల్లి జిల్లా కేంద్రంలో భూపాలపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్మ సమాజ్
పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు.ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ విద్యాహక్కు చట్టాన్ని చట్టాన్ని అమలు పూర్తిగా అమలు చేయకపోవడంతో ప్రైవేట్ స్కూలు యజమానులు మితిమీరిన ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.
అధిక ఫీజులను అరికట్టాలని, స్కూల్లో యూనిఫామ్స్ బుక్స్h అత్యధిక ధరలకు అమ్మకుండా చూడాలన్నారు. ప్రైవేట్ స్కూళ్లలో సరియైన వసతులు లేవని, వాటిని గుర్తించి బెస్ట్ అవలేబుల్ స్కీం పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలన్నారు. బెస్ట్బి అవలేబుల్ స్కీం పిల్లలకు అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయని,ఈ విషయంలోడీఈఓ పూర్తి పర్యవేక్షణ చేసి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వమే ఉచిత బస్ సౌకర్యం కల్పించాలని,
ప్రభుత్వ స్కూళ్లను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని గుర్తు చేశారు.విద్యార్థులకు ఇదంతా చేయాలంటే రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేడని విద్యాశాఖ మంత్రి పదవీ తన దగ్గరే ఉంచుకున్నాడని వెంటనే విద్యాశాఖ మంత్రిని నియంచాలని అన్నారు. విద్య శాఖ సమస్యలు పరిష్కరించని పక్షంలో రాబోయే రోజుల్లో ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా రాస్తా రోకో చేస్తామన్నారు.తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకులాల సెక్రటరీ అలుగు వర్షిని గౌలిదొడ్డి గురుకుల ఇంటర్ ద్వితీయ సంవత్సరం చెందుతున్న విద్యార్థులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ధర్మసమాజ్ పార్టీ జిల్లా కోశాధికారి బొజ్జపల్లి మహర్షి, లాపాక అరబిందో, శనిగరపు గణేష్ బోయిని ప్రసాద్ లాపాక శేషి పాల్గొన్నారు.








