Mahaa Daily Exclusive

  నేటి సభకు కాంగ్రెస్ శ్రేణులు తరలిరావాలి ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీ‌నివాస రెడ్డి పిలుపు..!

Share

ఆదిలాబాద్, మహా:

జై బాపు, జై భీం, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం హైదరాబాదు ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుల సమ్మేళనానికి పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చి జయప్రదం చేయాలని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీ‌నివాస రెడ్డి
ఒక ప్ర‌క‌ట‌న‌లో పిలుపు
నిచ్చారు. ఈ సభకు పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హాజరైవుతారని పేర్కొన్నారు. పార్టీని గ్రామ‌స్థాయిలో సంస్థాగతంగా మరింత బలోపేతం చేసి, ఎలా ముందుకు తీసుకువెళ్లాలి, అందుకు తీసుకోవల్సిన చర్యలపై పార్టీ శ్రేణలకు, ఖర్గే దిశా నిర్దేశం చేయనున్నారని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పధకాల తీరు తెన్నులపై పార్టీ శ్రేణులతో చర్చించడంతో పాటు, ప్రజా సంక్షేమ పథకాలను ఏ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాల‌న్న‌ తదితర అంశాలపై పార్టీ శ్రేణులకు సూచనలు, సలహాలు తెలియజేయునట్లు తెలిపారు. ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలోతరలివచ్చి విజయవంతం చేయాలని, ఖర్గే సందేశాన్ని గ్రామాలలోని ప్రజలకు చేరవేయాలని సూచించారు.

Latest