Mahaa Daily Exclusive

  ఖర్గే సభ విజయవంతం చేయండి. – ఉమ్మనేని రమేష్ పిలుపు…!

Share

మధిర, మహా.
జూలై 4వ తేదీన హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరగనున్న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభను విజయవంతం చేయాలని మధిర నియోజకవర్గ యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఉమ్మనేని రమేష్ మండలంలోని గ్రామ శాఖ అధ్యక్షులకు పిలుపునిచ్చారు.

పార్టీ చరిత్రలోనే ఇదొక వినూత్నమైన, విశిష్టమైన కార్యక్రమమని పేర్కొన్న ఉమ్మనేని రమేష్, దేశ స్థాయిలో గ్రామ శాఖ అధ్యక్షులతో ఏఐసీసీ అధ్యక్షుడు ప్రత్యక్షంగా సమావేశమవడం ఇదే తొలిసారని వివరించారు. కాంగ్రెస్ పార్టీ పునరుద్ధరణ దిశగా, స్థానిక నాయకులకు ప్రాధాన్యతనిస్తూ పార్టీ తీసుకుంటున్న నూతన ప్రయోగానికి ఇది ప్రతీకగా నిలుస్తుందన్నారు.

“ఈ మహాసభలో పాల్గొనడం ప్రతి గ్రామ శాఖ అధ్యక్షుడి బాధ్యత. మల్లికార్జున ఖర్గే గారు ఏఐసీసీకి నాయకత్వం వహిస్తున్న తరుణంలో, గ్రామ స్థాయికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ మళ్లీ మానవ సంబంధాల పునాది మీద ముందుకు సాగుతోంది. మధిర నియోజకవర్గం నుంచి కూడా భారీగా నాయకులు, కార్యకర్తలు హాజరై సభను ఘనవంతం చేయాలి” అని రమేష్ విజ్ఞప్తి చేశారు.

Latest