Mahaa Daily Exclusive

  రోడ్డు ప్రమాదం, చికిత్స పొందుతూ ఆటో డ్రైవర్ మృతి ..!

Share

రోడ్డు ప్రమాదం, చికిత్స పొందుతూ ఆటో డ్రైవర్ మృతి

మందమర్రి, మహా : మందమర్రి పోలీస్ స్టేషన్ అందుగుల పేట పంచాయితీ పరిధిలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గోమాస తిరుపతి (29) అనే వ్యక్తి ప్రమాదానికి గురికాగా ఆయన చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు స్థానిక ఎస్సై రాజశేఖర్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
తాండూర్ మండలం, రేచిని గ్రామానికి చెందిన గోమాస తిరుపతి వృత్తిరీత్యా ఆటో డ్రైవర్, తన స్నేహితుడైన గువ్వల కిషోర్‌తో మంగళవారం ప్రయాణం కిరాయి నిమిత్తం మంచిర్యాలకు వెళ్లారు. తిరిగి వారు వస్తున్న క్రమంలో రాత్రి 11 గంటల 30 నిమిషాలు ప్రాంతంలో అందుగుల పేట పంచాయతీ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ సమీపంలోకి రాగానే, వెనుక నుండి వేగంగా ఒక లారీ వారి ఆటోను బలంగా ఢీకొట్టి నట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న గోమాస తిరుపతి, గువ్వల కిషోర్‌లకు తీవ్ర గాయాలు కాగా వీరిని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఆయన వెల్లడించారు. తిరుపతికి
మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌లోని కెల్విన్ ఆసుపత్రికి తరలించగా అక్కడ తిరుపతి చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.
ఈ సంఘటనపై మృతుని తమ్ముడైన గోమాస రాజ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎస్ రాజశేఖర్ తెలిపారు.

Latest