Mahaa Daily Exclusive

  ప్రభుత్వ ఆసుపత్రులను సందర్శించిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్..!

Share

హన్మకొండ మహా;

టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా టీబీ వ్యాధికి ఎక్కువగా గురయ్యే అవకాశం ఉన్న ప్రజలకు నిర్వహిస్తున్న పరీక్షలలో భాగంగా ఎక్స్ రే పరీక్షల తీరును అలాగే ఇంకా ఎక్కువ మందికి ఎక్స్ రే పరీక్షలు నిర్వహించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించేందుకు హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ శుక్రవారం సాయంత్రం ప్రభుత్వ టీబీ హాస్పిటల్ ను సందర్శించారు.
ఆసుపత్రిలో ప్రతిరోజు ఎన్ని ఎక్స్ రే లు తీస్తున్నారని ఇంకా ఎక్కువ తీయడానికి అవకాశం ఉందా, ఇప్పటివరకు ఎన్ని ఎక్స్ రే లు తీశారని అని జిల్లా కలెక్టర్ ప్రశ్నించారు.
ఎక్కడైనా రేడియోగ్రాఫర్ ఉన్నట్లయితే టీబీ ఆసుపత్రికి తరలించాలని డిఎంహెచ్ఓను ఆదేశించారు. ఆసుపత్రిలోని ఓపి విభాగాలను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ప్రస్తుతం టీబీ చికిత్స పొందు తున్నటువంటి వ్యాధిగ్రస్తులందరికీ ముందుగా ఒక నెల పోషకాహార కిట్ ను అందించాలని సూచించారు. మిగిలిన చికిత్స కాలంలో కూడా వారికి పోషకాహార కిట్ అందించే దిశగా ప్రయత్నం చేయడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. ఏ అప్పయ్య , టీబీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సునీత, ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి, క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ హిమబిందు ,టీహబ్ మేనేజర్ కౌముది, తదితరులు పాల్గొన్నారు.

Latest