వరంగల్ మహా;
భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో గురుపూర్ణిమ కార్యక్రమాలలో భాగంగా రెండవ రోజు వరంగల్ చౌరస్తా లోని కె కన్వెన్షన్ హాల్ లో
గురుపూర్ణిమ కార్యక్రమ జిల్లా కన్వీనర్ బిజెపి సీనియర్ నాయకులు గందె నవీన్ అధ్యక్షతన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుసుమ సతీష్,రత్నం సతీష్ షా వన్నాల వెంకటరమణ, సముద్రాల పరమేశ్వర,మాట్లాడుతూ వ్యాసుని పుట్టిన రోజు ఆషాఢ శుద్ధ పౌర్ణమి గా అదే వ్యాస పౌర్ణమి గురు పౌర్ణమి గా ప్రసిద్ధి కెక్కిందని భారతీయ సనాతన ధర్మంలో గురువుకు గురు పరంపరకు ఎంతో ప్రాధాన్యం ఉందని తెలిపారు. గురువులను భగవంతుడిగా భావించి ఆరాధించడం భారతీయుల సంస్కృతి సాంప్రదాయమని అందుకే ఆషాడ శుద్ధ పౌర్ణమిని గురు పౌర్ణమి గా నిర్వహించు కుంటున్నాం. కార్యక్రమంలో భాగంగా విభిన్న వర్గాలకు చెందిన 65 మంది గురువులకు, గురు సామానులకు ఈ సందర్భంగా జ్ఞాపికలను బహుకరించి శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బాకం హరి శంకర్, ఉపాధ్యక్షులు కనుకుంట్ల రంజిత్, మాచర్ల దీనదయాళ్, టేకుమట్ల రేణుక ,బైరి శ్యాంసుందర్,ఆడెపు వెంకట్, బైరి నాగరాజు, కూచన క్రాంతి, నోముల రతన్ జిల్లా కు చెందిన బీజేపీ నాయకులు కార్యకర్తలు, పాల్గొన్నారు.








