Mahaa Daily Exclusive

  సమాజం మార్పులో విద్యార్థులు భాగస్వాములు కావాలి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద ..!

Share

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
సమాజ మార్పులో విద్యార్థులు సైతం భాగస్వాములు కావాలని రాష్ట్ర మహిళా చైర్మన్ నేరెళ్ల శారద అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో ఎస్టీ వసతి గృహంలో జరిగిన కెఫింటెక్ సంకల్ప కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ… మారుతున్న సమాజంలో విదేశీ పోకడలకు సోషల్ మీడియాకు ఆసక్తులై తమ నిండు జీవితాలను వృధా చేసుకోవద్దని సూచించారు. విద్యలో నైపుణ్యం చెంది ఉన్నత శిఖరాలను అధిరోహించి తల్లిదండ్రులు కన్న కలలను నిజం చేయాలన్నారు. విద్యను అభ్యసించే సమయంలో గ్రామీణ ప్రాంత విద్యార్థులు పట్నం వాతావరణం నచ్చక మానసికంగా కృంగిపోతున్నారని తెలిపారు. విద్యార్థినీలు తమ ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని, వీలైతే వైద్యులను సంప్రదించి వారు సూచించిన విధంగా నడుచుకోవాలని దురాలవాట్లకు దూరంగా ఉండాలని ఆమె విద్యార్థులను కోరారు. గిరిజన వసతి గృహంలోని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా మౌలిక సౌకర్యాలు కల్పించి, వార్డెన్ తగు జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. వసతి గృహాన్ని అభివృద్ధి చేయటం కోసం కెఫింటెక్ సంస్థ వాళ్ళు దత్తత తీసుకోవడం అభినందనీయమన్నారు.

దేశంలో పేద పెద్ద అనే వ్యత్యాసం లేని విద్యారంగం రావాలి…
ఇతర దేశాలలో విద్యావ్యవస్థ ఉన్న మాదిరిగా, ప్రైవేట్ విద్యాసంస్థలకు అవకాశం లేకుండా, ప్రభుత్వమే విద్యా వ్యవస్థను నడిపించాలని తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం, ప్రభుత్వ విద్యను ప్రతి రాష్ట్రంలో పేద పెద్ద అనే వ్యత్యాసం లేకుండా, ప్రభుత్వ విద్యాసంస్థలు ఏర్పాటు చేసి, అందరికీ ఒకే చోట విద్యను అభ్యసించేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని మహిళ కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విద్యార్థులు అందరికీ ఒకే చోట అభ్యసించేలా ఉత్తరాలు రాయాలని విద్యార్థులకు ఆమె పిలుపునిచ్చారు.

ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వైద్య రంగాన్ని అభివృద్ధి చేయడానికి సంకల్పంతో ఉందన్నారు. కెఫింటెక్ సంస్థ యాజమాన్యం వసతి గృహాన్ని అభివృద్ధి చేస్తామని ముందుకు వచ్చి విద్యార్థినుల భవిష్యత్తు కోసం, కోటి పది లక్షలతో కనీస వసతులు కల్పిస్తూ వసతి గృహాన్ని అభివృద్ధి చేసి విద్యార్థులకు అందించినందుకు అభినందనలు తెలిపారు. భవిష్యత్తు తరాలకు గుర్తుండేలా అభివృద్ధి చేయడం సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టాక రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలను, వసతిగృహాలను ప్రైవేటుకు దీటుగా అభివృద్ధి చేసిందన్నారు.

విద్యతోనే జీవితం ముడిపడి ఉంటుంది…
విద్యతోనే జీవన ప్రమాణాలు మెరుగవుతాయని, విద్యతోనే జీవితం ముడిపడి ఉంటుందని, విద్యను నిర్లక్ష్యం చేయకుండా ఉత్తమ ఫలితాల సాధన కోసం నిర్వీర్వంగా శ్రమించాలని ఎమ్మెల్యే విద్యార్థినీలకు సూచించారు. మహిళల రక్షణ పట్ల ప్రభుత్వం షీ టీం ను ఏర్పాటు చేయడం జరిగిందని, విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్న స్థానిక పోలీసులను సంప్రదిస్తే, పోలీసులు ఆ యొక్క సమస్యను పరిష్కరిస్తారని, ఫిర్యాదు చేసిన విద్యార్థుల వివరాలను గోప్యంగా ఉంచుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గురునాథ్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ పాండురంగారెడ్డి, మాజీ జెడ్పిటిసి భూపతిగల్ల మహిపాల్, రాష్ట్ర నాయకులు శేఖర్ గౌడ్ (మామ), సేవాదళ్ అధ్యక్షులు మంకాల దాసు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముత్యాల రాజశేఖర్ రావు, ఏఎంసి వైస్ చైర్మన్ కర్ణాకర్, ఇబ్రహీంపట్నం సీఐ మహేందర్ రెడ్డి, జిల్లా అధికారులు పద్మజరాని రామేశ్వరీ దేవి శ్రీలత డీఈవో సుసింధర్ రావు వెంకటేశ్వర్లు రామారావు నవీన్ రెడ్డి తాసిల్దార్ సునీత రెడ్డి ఎంపీడీవో జంగయ్య కంపెనీ హెచ్ఆర్ సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Latest