Mahaa Daily Exclusive

  గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో ఏసీ ప్రెస్ మీట్ హాల్ ప్రారంభం..!

Share

హన్మకొండ మహా;

గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ మొదటి అంతస్తులో ఆధునీకరించిన ప్రెస్ మీట్ హాల్ ను గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు శుక్రవారం ప్రారంభించారు. ప్రెస్ మీట్ కోసం వచ్చే వారికి, మీడియాకు ప్రత్యేకంగా కుర్చీలు, హాల్ లో ఆధునిక లైటింగ్ సౌకర్యంతో పాటు ఏసీలు ఏర్పాటు చేశారు. ప్రెస్ క్లబ్ అభివృద్ధిలో భాగంగా అవసరమైన శాశ్వత పనులను చేస్తున్నామని ఈ సందర్భంగా అధ్యక్షులు వేముల నాగరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బొల్లారం సదయ్య, కోశాధికారి బోల్ల అమర్, ఉపాధ్యక్షులు గోకారపు శ్యాంకుమార్, బొడిగె శ్రీను, కొడిపెల్లి దుర్గాప్రసాద్ రావు, అల్లం రాజేష్ వర్మ, యాంసాని శ్రీనివాస్, సహాయకార్యదర్శులు సంపెట్ సుధాకర్, పెద్దపల్లి వరప్రసాద్, వలిశెట్టి సుధాకర్, పొడిచెట్టి విష్ణువర్ధన్, ఈసీ మెంబర్లు వీరగోని హరీష్, దొమ్మాటి శ్రీకాంత్, జనగాని ఆంజనేయులు, ఎండీ నయీం పాషా,గుండెబోయిన దిలీప్ కుమార్, కందుకూరి సంజీవ్, మంచాల రాజు పాల్గొన్నారు.
అనంతరం క్లబ్ బాధ్యుల సాధారణ సమావేశం అధ్యక్షులు వేముల నాగరాజు అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా సభ్యులకు వారంలోపు ఇన్సూరెన్సులు చేయించాలని అందుకోసం 2-3 రోజుల్లో విధి, విధానాలు ప్రకటించాలని చెప్పారు. క్లబ్ సభ్యుల కోసం గుండె, నరాలు, గ్యాస్ సంబందిత వ్యాధి నిర్థారణ పరీక్షలు చేయించి, ప్రముఖ వైద్యులచే మెగా హెల్త్ క్యాంపు నిర్వహించాలని నిర్ణయించారు. క్లబ్ అభివృద్ధి, సభ్యుల సంక్షేమం విషయంలో చిత్తశుద్ధితో వ్యవహరిస్తామని అన్నారు.
వర్కింగ్ జర్నలిస్టులు కాని వారికి క్లబ్లో ఎట్టి పరిస్థితుల్లోనూ సభ్యత్వం కొనసాగించ కూడదని,అక్రమ మార్గంలో సభ్యత్వం పొందిన వారి సభ్యత్వాన్ని తొలగించాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు.
పలు అంశాలపై క్షుణ్ణంగా చర్చించారు.

Latest