హన్మకొండ మహా;
ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా శుక్రవారం హనుమ
కొండ లోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి సమావేశ మందిరంలో డాక్టర్ మంజుల ప్రోగ్రాం అధికారి మాతా శిశు సంక్షేమం అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి డాక్టర్ ఏ అప్పయ్య, తో పాటు సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా డాక్టర్ అప్పయ్య గారు మాట్లాడుతూ ప్రపంచ జనాభా 820 కోట్లు ఉండగా అందులో 146 కోట్ల జనాభాతో మన భారతదేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉందని , ఈ సంవత్సరం థీమ్ “ప్రణాళిక బద్ధమైన మాతృత్వం కోసం గర్భధారణకు మధ్య ఆరోగ్యకరమైన సమయం, శారీరకంగా మానసికంగా సిద్ధంగా ఉన్నప్పుడే తల్లి కావడానికి సరైన సమయానికి అనుగుణంగా వైద్య ఆరోగ్య సిబ్బంది ఇతర ప్రభుత్వ విభాగాల వారితో సమన్వయంతో పని చేస్తూ బాల్య వివాహాల నియంత్రణ, కొత్తగా పెళ్లయిన దంపతులకు అలాగే మొదటి సంతానం కలిగి ఉన్న దంపతులకు కాన్పుల మధ్య 2-3 సంవత్సరముల వ్యవధి గురించి అందుబాటులో ఉన్న వివిధ పద్ధతులను అవగాహన కలిగించాలని హనుమకొండ డిఎంహెచ్ఓ డాక్టర్ ఏ అప్పయ్య ఈ సందర్భంగా సూచించారు.
అనంతరం కాన్పుల మధ్య అంతర ఇంజక్షన్లు వాడుతున్న జి శైలజ ను సన్మానించి వెయ్యి రూపాయల నగదు ప్రోత్సాహకం అందించారు.
కుటుంబ నియంత్రణలో విశిష్టమైన సేవలందించిన , అలాగే కోతకుట్టులేని ఆపరేషన్లు నిర్వహిస్తున్న డాక్టర్ ఎండి యాకుబ్ పాషా, టి విమల నర్సింగ్ ఆఫీసర్, హెల్త్ సూపర్వైజర్ కుమారస్వామి , ఏఎన్ఎం రజిత, టి రమ ఆశా కార్యకర్త లను ఘనంగా సత్కరించి మెమోంటోలు, సర్టిఫికెట్ల ను ప్రధానం చేశారు.
అంతకుముందు ప్రభుత్వ ఆసుపత్రి నుండి పట్టణ కుటుంబ సంక్షేమ కేంద్రం, పోచమ్మ కుంట పెద్దమ్మ గడ్డ పట్టణ ఆరోగ్య కేంద్రాల వైద్య సిబ్బంది సెంట్ ఆన్స్ నర్సింగ్ విద్యార్థులతో నిర్వహించిన జనాభా ర్యాలీని డిఎంహెచ్వో డాక్టర్ అప్పయ్య జెండా ఊపి ప్రారంభించారు. ప్రధాన రోడ్డు పై మానవహారం కూడా నిర్వహించారు. ఈ సమావేశంలో జిఎంహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి, అడిషనల్ డిఎంహెచ్వో డాక్టర్ టి మదన్మోహన్రావు, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ విజయకుమార్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ మహేందర్, జిల్లా టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ హిమబిందు , మాతా శిశు సంక్షేమం ప్రోగ్రాం అధికారి డాక్టర్ మంజుల ఎన్సిడి ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఇక్తెదర్ అహ్మద్, వైద్యాధికారి డాక్టర్ గీత జిల్లా మాస్ మీడియా అధికారి వి అశోక్ రెడ్డి, హెల్త్ ఎడ్యుకేషన్ అధికారులు శ్రీ చంద్రశేఖర్, ఎస్ శ్రీనివాస్, కమ్యూనిటీ హెల్త్ అధికారులు నెహ్రూ చంద్ మాధవరెడ్డి,హెచ్ఇఓ రాజేశ్వర్ రెడ్డి , ఖాదర్ అబ్బాస్, పబ్లిక్ హెల్త్ నర్సింగ్ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.







