Mahaa Daily Exclusive

  సీతారాంపురంలో ఉచిత కంటి వైద్య శిబిరం యూత్‌ ఐకాన్స్‌ ను అభినందించిన ప్రజలు..!

Share

కారేపల్లి, మహా : కారేపల్లి మండలం సీతారాంపురంలో యూత్‌ ఐకాన్స్‌ ఆధ్వర్యంలో శనివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శరక్‌ మాక్స్‌విజన్‌ సూపర్‌స్పెషలాటి ఆసుపత్రి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో 200 వరకు కంటి పరీక్షలు చేయించుకున్నట్లు నిర్వాహకులు గుండమళ్ళ కార్తిక్‌కుమార్‌ తెలిపారు. పరీక్షలు నిర్వహించిన వారికి ఆవసరమైన మందులను పంపిణి చేశారు. శస్త్ర చికిత్స అవరసమైన వారికి వైద్యులు రిఫర్‌ చేశారు. ఈసందర్బంగా యూత్‌ ఐకాన్స్‌ సభ్యులు మాట్లాడుతూ నాణ్యమైన వైద్యాన్ని ప్రజల వద్దకు తీసుకరావటం, స్వచ్ఛంధ కార్యక్రమాలతో ప్రజలకు అండగా ఉండనున్నట్లు తెలిపారు. వైద్యశిబిరంను నిర్వహించటం పట్ల గ్రామస్తులు యువకులను అభినందించారు. ఈకార్యక్రమంలో గుండమల్ల కార్తీక్‌ కుమార్‌, మర్సకట్ల నాగేశ్వరరావు, కొలికపొంగు సాయి, జోగ వెంకటేష్‌, జోగ సాయి తదితరులు పాల్గొన్నారు.

Latest