Mahaa Daily Exclusive

  అక్రమ అరెస్టుల‌కు పాల్పడింది నువ్వే జ‌గ‌న్‌: శాప్ ఛైర్మన్

Share

AP: రాష్ట్రంలో అక్రమ అరెస్టుల‌కు పాల్పడింది వైసీపీ అధినేత జ‌గ‌నే అంటూ శాప్ ఛైర్మన్ ర‌వినాయుడు మండిపడ్డారు. తమ పార్టీ శ్రేణులపై అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారన్న జగన్ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. గతంలో మూడుసార్లు సీఎంగా పని చేసిన చంద్రబాబును అరెస్ట్ చేయించింది తమరు కాదా జ‌గ‌న్‌ అని రవి నాయుడు ప్రశ్నించారు. వైసీపీ హయాంలో టీడీపీ నేతల‌ను అక్రమంగా అరెస్టు చేయించి ఎంత ఇబ్బంది పెట్టావో గుర్తు లేదా అని నిలదీశారు.

Latest