Mahaa Daily Exclusive

  దండి సురేష్ కు శుభాకాంక్షలు: ఆర్జేసి కృష్ణ..!

Share

ఖమ్మం సిటీ, మహా.
సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి గా ఎన్నికైన దండిసురేష్ ను మున్నూరు కాపు సంక్షేమ సంఘం నాయకులు,ఖమ్మం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుండాల కృష్ణ ఆధ్వర్యం లో యాదవ సంఘం అధ్యక్షులు,మాజీ డిసిసిబి ఛైర్మన్ కురాకుల నాగభూషణం, గౌడ సంఘం అధ్యక్షులు కత్తి నెహ్రూ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు
కొత్తాసీతారాములు,ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రధాన కార్యదర్శి మెంతుల శ్రీశైలం,గీతా వెంకన్న,కనకం జనార్దన్ తదితరులు కలిసి బుధవారం సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ సురేష్ తన నియామకం ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి అని ఆకాంక్షించారు.మిగతా పార్టీలు కూడా బీసీ లకు తగు ప్రాదాన్యత ఇవ్వాలన్నారు.అదేవిధంగా బీసీ లంతా ఒకతాటి పైకి వచ్చి 42శాతం రిజర్వేషన్ తో పాటు త్వరలో జరిగే కేంద్ర కులగణను కూడా విజయవంతం చేసుకుని బీసి లంతా రాజ్యాధికారం దిశగా పయనించాలన్నారు.