Mahaa Daily Exclusive

  టెండాల్ సూపర్వైజర్ పోస్టుకు ప్రాక్టికల్ టెస్ట్ ..!

Share

భద్రాద్రి కొత్తగూడెం , జులై 23(మహా): సింగరేణి కొత్తగూడెం ఏరియా వర్క్ షాప్ లో బుధవారం టెండాల్ సూపర్వైజర్ పోస్టు కొరకు యాజమాన్యం ప్రాక్టికల్ టెస్ట్ ను నిర్వహించారు. ఈ టెండాల్ సూపర్వైజర్ పోస్టు 1 వేకెన్సీ ఉండగా అర్హత కలిగిన అభ్యర్ధులు ఇద్దరు దరఖాస్తు చేసుకొగా వారి దరఖాస్తులను పరిశీలించిన అనంతరం కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఆదేశాల మేరకు టెండాల్ సూపర్వైజర్ పోస్టుల కొరకు దరఖాస్తు చేసుకున్న వారికి ఏరియా వర్క్ షాప్ లో టెండాల్ సూపర్వైజర్ టెస్టును కమిటీ సభ్యులచే నిర్వహించారు. ఏరియా వర్క్ షాప్ డిజిఎం(ఈ అండ్ఎం) టి.శ్రీకాంత్ టెండాల్ సూపర్వైజర్ ప్రాక్టికల్ టెస్ట్ నిర్వహణకు కావాల్సిన పరికరాలను వసతులను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ చైర్మన్ ఎస్ఓటు జిఎం జి.వి.కోటిరెడ్డి, కమిటీ సభ్యులు ఏరియా ఇంజనీర్ కే.సూర్యనారాయణ రాజు, డిజిఎం (పర్సనల్)జీ.వి.మోహన్ రావు, డిజిఎం (ఐఈడి)ఎన్.యోహాన్ తో పాటు ఏరియా వర్క్ షాప్ డిజిఎం(ఈ అండ్ ఎం) టి.శ్రీకాంత్, పర్సనల్ డిపార్ట్మెంట్ సిబ్బంది డి.కిషోర్ కుమార్, టెండాల్ సూపర్వైజర్ పోస్ట్ కొరకు దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులు పాల్గొన్నారు.