Mahaa Daily Exclusive

  ఏటీఎం లో చోరీ.. నగదు ఎత్తుకెళ్లిన దొంగలు..!

Share

ఆదిలాబాద్, మహా

పట్టణంలోని రామ్ నగర్ లో గల ఏటీఎం లో శనివారం తెల్లవారుజామున దొంగతనం జరిగింది. రాంనగర్ కాలనీలో గల ఎస్బీఐ బ్రాంచ్ ఏటీఎంలో దొంగలు పడి
నగదును ఎత్తుకెల్లారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ జీవన్ రెడ్డి, మావల, ఆదిలాబాద్ వన్ టౌన్
సీఐలు స్వామి, సునీల్ కుమార్ లు ఘటన స్థలానికి చేరుకున్నారు. గుర్తులు తెలియకుండా
కెమెరాపై బ్లాక్ స్ప్రే చేసి దొంగలు నగదుతో ఉడాయించినట్లు గుర్తించారు. ఏటీఎం మిషన్ ను గ్యాస్ కట్టర్ తో కట్ చేసినట్టు పోలీసులు
ప్రాథమికంగా గుర్తించారు. అయితే అందులో ఎంత డబ్బు ఉందన్నా విషయమై స్పష్టత రావాల్సి ఉంది. సీసీ టీవీ ఫుటేజ్ లను
బ్యాంక్ వారు పోలీసులకు అందించలేదని, ఫిర్యాదు కూడా అందలేదని మావల సీఐ స్వామి
తెలిపారు. ఘటన స్థలంలో వేలిముద్రల సేకరణ, దొంగతనం జరిగిన తీరును పరిశీలించి విచారణ ప్రారంభించినట్లు తెలిపారు.