AP: కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలను చాలామంది ఎగతాళి చేశారని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. శనివారం తూర్పు గోదావరి జిల్లాలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్రలో కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడం సాధ్యం కాదన్నారని, అయితే తాము వాటిని అమలు చేసి చూపించామన్నారు. 2047 నాటికి రాష్ట్రంలో ప్రతి ఒక్కరి మొహంలో ఆనందం చూడాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
Post Views: 53






