దేశంలో ప్రస్తుతం సమాఖ్య స్ఫూర్తికి తీవ్ర ముప్పు వాటిల్లుతోందని ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం చెన్నైలో జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాల అధికారాలను హరించి వాటిని కేవలం మున్సిపాలిటీల స్థాయికి తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైతే రాజ్యాంగాన్ని పరిరక్షించడమే తన ప్రథమ కర్తవ్యమని ఆయన స్పష్టం చేశారు.
Post Views: 44







