Mahaa Daily Exclusive

  లంబాడీలపై చేస్తున్న కుట్రలను మానుకోవాలి…!

Share

నెలకొండపల్లి, ఆగస్టు 31 మహా :

తెలంగాణలో ఎస్టీ జాబితా నుండి లంబాడి బంజారా, సుగాలి కులాలను తొలగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపీ స్వయం బాబురావు,భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు లు ఎస్టీ కులాలపై చేస్తున్న కుట్రలను మానుకోవాలని సిపిఐ మండల ప్రధాన కార్యదర్శి పాల్త్య శ్రీనివాస్ నాయక్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత లంబాడి, సుగాలి, బంజారా వర్గాలకు ఎస్టీ జాబితాలో కొనసాగించవలసిన అవసరం లేదని భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల రాజకీయ అవకాశవాదం కోసం పిటిషన్ వేశారని,ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలు కూడా భారతదేశంలో అంతర్భాగ రాష్ట్రాలేనని కనీస అవగాహన లేని నాయకులు సోయం బాబురావు, తెల్లం వెంకటరావు అని విమర్శించారు.స్వాతంత్రం వచ్చినప్పటికీ నుంచి రాజ్యాంగం అమల వచ్చిన 1950లో నుంచి ఆదివాసులు ఎస్టీ జాబితాలో కొనసాగుతూ మరి ఆనాడు దాదాపు 20 సంవత్సరాల తర్వాత ఎస్టీ జాబితాలో చేర్చబడ్డారని, లంబాడీలు వల్ల హక్కులు కోల్పోతున్నామని మాట్లాడడం సిగ్గుచేటు అన్నారు. ఏజెన్సీ ఏరియాలో వంద శాతం ఏజెన్సీలకే ఉద్యోగాలు కల్పించే జీవో 3 సుప్రీంకోర్టు కొట్టి వేస్తే ఎన్నడూ కూడా ఈ ఆదివాసి ఎమ్మెల్యేలు మాట్లాడలేదని,ఆ జీవో పునర్దించాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వానికి, సుప్రీంకోర్టులను ఆశ్రమించింది లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కోసం ఓటు వేసి 45 అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కారకులైన లంబాడీలను ఎస్టీ జాబితాలో నుంచి తొలగించాలని కొంతమంది స్వార్థపరులు కుట్రలు చేస్తున్నారని, అలాంటి వారిపై కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో లంబాడి బంజారాలు కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని ఆయన డిమాండ్ చేశారు…

Latest