ఖమ్మం, మహా.
ఎస్టీ జాబితా నుండి లంబాడీలను తొలగించాలని కోవడం సరైనది కాదని
సేవాలాల్ సేన జాతీయ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ బానోత్ కిషన్ నాయక్ తెలిపారు, ఆదివారం ఖమ్మంలో ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.రాష్ట్రంలో గిరిజన లంబాడీలు, ఆదివాసి బిడ్డలు కలిసి సంతోషంగా జీవిస్తున్న సందర్భంలో రాజకీయ లబ్ధి కోసం రెండు వర్గాల మధ్య విభేదాలు సృష్టించడం అనవసరం.
ఎస్టీ జాబితాలో లంబాడీలు 1976 నుండి రాజ్యాంగబద్ధంగా పొందుపరిచి రిజర్వేషన్ల లబ్ధి పొందుతున్నట్లు పేర్కొన్నారు. ఈ తరుణంలో విభేదాలు సృష్టించే వార్తలకు నమ్మకం ఇవ్వరాదు అని బానోత్ కిషన్ నాయక్ హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించేందుకు బాధ్యత వహించాలని ఆయన చెప్పారు.
సభలో టీఎస్ టి.టి.ఎఫ్, ఏఐబిఎస్ఎస్, టీజీబీఈఎఫ్, గిరిజన సంఘం, సేవాలాల్ సేన నాయకులు మరియు జిల్లా, మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు.






