Mahaa Daily Exclusive

  పీడితుల పక్షాన నిలబడేది కమ్యూనిస్టులే సీపీఐ బలోపేతానికి పరితపించిన నేత మంగు ..!

Share

కారేపల్లి, మహా : ప్రపంచ వ్యాప్తంగా పీడితుల పక్షం వహిస్తూ వారి పక్షాన నిఖార్సుగా నిలబడేది కమ్యూనిస్టులే అని సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్‌ అన్నారు. కారేపల్లి మండలం భాగ్యనగర్‌తండాలో ఇటివల మృతి చెందిన సీపీఐ సీనియర్‌ నాయకులు గుగులోత్‌ మంగు సంస్మరణ సభ సీపీఐ మండల కార్యదర్శి పాపినేని సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది. ఈ సభలో దండి రమేష్‌ మాట్లాడుతూ ప్రజాసమస్యలే ఏజెండాగా కమ్యూనిస్టులు నిరంతరం పోరాటాలు చేసిన ఫలితంగానే పాలకులు పేదలకు సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నారన్నారు. పాలకులు ఇచ్చిన హామీలు అమలయ్యేంతవరకు ప్రభుత్వాలపై పోరాటాలతో ఒత్తిడి తెస్తామన్నారు. గుగులోత్‌ మంగు నిబధ్దత గల కార్యకర్త అని కొనియాడారు. సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ లో కీలక భూమిక పోషించారన్నారు. మంగు లేని లోటు కుటుంబానికే కాక ఈప్రాంత పార్టీకి తీరని లోటన్నారు. ఈ సంస్కరణ సభలో సిపిఐ వైరా నియోజకవర్గ ఇన్చార్జ్‌ ఎర్రబాబు, జిల్లా కార్యవర్గ సభ్యులు ఏపూరి లతాదేవి, రావి శివరామకఅష్ణ, శంకర్‌, బంధం నాగయ్య, ఉంగరాల సుధాకర్‌, గుగులోతు రామ్‌ చందర్‌, బస శ్రీనివాసరావు, నాయకులు పాటి అనంతరాములు, రాయల రామారావు, పోతనబోయిన రవి, సహాదేవ్‌, అమఅ, బావుసింగ్‌, కౌలియా, హరి సింగ్‌, రవి, మంగు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Latest