రంగారెడ్డి జిల్లా మహా:
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం దారుణంగా హత్య చేసిన ఘటన చోటు చేసుకుంది. ఇబ్రహీంపట్నం మండలం, దండుమైలారం గ్రామంలోని ఇరు వర్గాల మధ్య 11 గుంటల భూమి, ఒక వ్యక్తి ప్రాణం తీసింది. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. గొడ్డలి గాయాలతో పలువురు హాస్పిటల్ పాలయ్యారు. దీనితో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. జరిగిన గొడవ కారణంగా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకున్నారు. గ్రామంలో ఉధృత పరిస్థితులు నెలకొనడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఏసిపి కెపివి రాజు, పోలీస్ పహారా ఏర్పాటు చేశారు. హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని, నిందితులకు సహకరించిన వారిపై హత్య కేసు నమోదు చేయాలని మృతుడి బంధువులు పోలీసులను డిమాండ్ చేశారు. ఈ ఘటన
స్థానికులు తెలిపిన కథనం మేరకు వివరాల్లోకి వెళితే…
దండుమైలారం గ్రామానికి చెందిన గుడేటి జంగయ్య అనే వ్యక్తికి మూడు సర్వే నెంబర్లలో 18 ఎకరాల 12 గుంటల భూమి ఉన్నది. ఆయనకు నలుగురు కొడుకులున్నారు. ఒక్కో భాగానికి నాలుగు ఎకరాల పైచిలుకు భూమి రావాల్సి ఉండగా, అందులో కొడుకులకు 11 గంటల భూమి తక్కువ వచ్చిందని, మరో ఇద్దరు కొడుకులకు అదనంగా 11 గుంటల భూమి వచ్చింది. ఈ విషయమై గత రెండు, మూడు సంవత్సరాలుగా వీరి మధ్య గొడవలు జరుగుతూ వస్తున్నాయి. ఇటీవల ఇరువర్గాల వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసుకున్నారు. కాగా తగాదాలో ఉన్న భూమిలోకి వెళ్లి వ్యవసాయం చేస్తున్న ఇద్దరి కుటుంబ సభ్యులపై, మరో వర్గానికి చెందిన వ్యక్తులు గొడ్డలి వంటి మారునాయుధాలతో గొడవకు దిగి ఒక్క వ్యక్తిని విచక్షణ రహితంగా దారుణంగా హత్య చేశారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన చికిత్స కోసం నగరంలోని ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. మరి కొంతమందికి ఇబ్రహీంపట్నం హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు తెలిపారు.
విచక్షణ రహితంగా మారనాయుధాలతో దాడులు….
గొడ్డలితో చేసిన దాడిలో గుదేటి బాలరాజు అక్కడికక్కడే తీవ్ర గాయాలతో పడిపోయాడు. అడ్డుపోయిన వెంకటరాజు, మహిళపై సైతం మారణాయుధాలతో దాడులకు పూనుకున్నారు. దాంతో వారు తీవ్ర గాయాలయల పాలయ్యారు. రక్తపు మడుగుల్లో పడిపోయిన బాలరాజు అనే వ్యక్తిని ఇబ్రహీంపట్నం ప్రైవేట్ హాస్పిటల్కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. గాయాల పాలైన వారు సైతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా మంజుల పరిస్థితి మిషమంగా ఉండడంతో ఇబ్రహీంపట్నం ప్రైవేటు ఆసుపత్రి నుంచి నగరంలోని మరో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మంజుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో పైన పేర్కొన్న నరసింహ, మల్లయ్య వారసులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుని సోదరులు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉన్నట్లు ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు తెలిపారు. ఇదిలా ఉంటే మల్లయ్య, జంగయ్య వారసులు సైతం తమపై దాడులు చేసినట్లు ఈ దాడిలో గాయపడిన శ్రీశైలం, బాలరాజు, లింగస్వామి, యాదయ్య, పారిజాతలకు సైతం తీవ్ర గాలైనట్లు తెలుస్తోంది. వారు కూడా ఆసుపత్రిలో చికిత్సలు పొందుతున్నారు.






