Mahaa Daily Exclusive

  దివ్యాంగులందరికీ పింఛన్లు: మంత్రి కొండపల్లి

Share

AP: నోటీసులతో సంబంధం లేకుండా దివ్యాంగులందరికీ ఈ నెల పింఛన్ పంపిణీ చేయాలని CM ఆదేశించినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. నోటీసులందుకున్న 1.35 లక్షల మందిలో 95 శాతం మంది అప్పీల్ చేసుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అనర్హులపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు. కొత్తగా 7,872 మందికి రూ.4వేలు చొప్పున స్పౌజ్ పింఛన్ మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. ఇందుకోసం రూ.3.15 కోట్లు రిలీజ్ చేశామన్నారు.

Latest