TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం గద్వాల జిల్లాల్లో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు గద్వాలకు బయలుదేరుతారు. మధ్యాహ్నం 3:30 గంటలకు గద్వాలకు చేరుకుని, ధరూర్ మెట్ నుంచి ర్యాలీగా తేరు మైదానానికి చేరుకుంటారు. సాయంత్రం 5 గంటలకు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం హైదరాబాద్కు తిరిగి వెళ్తారు.
Post Views: 31






