TG: మంత్రి పొన్నం ప్రభాకర్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. త్వరలో జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేస్తామని, నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. ఖాళీల వివరాలను ఇప్పటికే సంబంధిత శాఖలకు పంపినట్లు స్పష్టం చేశారు. నోటిఫికేషన్లు సిద్ధంగా ఉన్నాయని, త్వరలోనే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభం అవుతుందని అన్నారు. కాగా గ్రూప్-1 పరీక్షలపై హైకోర్టు తీర్పును ప్రభుత్వం గౌరవిస్తుందని అన్నారు.
Post Views: 46






