Mahaa Daily Exclusive

  నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలి …మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ..!

Share

బెల్లంపల్లి మహా:బెల్లంపల్లి కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం పరిధిలో చేపట్టిన నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్య
లు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమా
ర్ దీపక్ పేర్కొన్నారు.శుక్రవారం జిల్లా
లోని బెల్లంపల్లి మండల కేంద్రంలో గల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాల
యం పరిధిలో చేపట్టిన అదనపు గదు
లు, పాఠశాలలో చేపట్టిన మూత్రశాల
ల నిర్మాణ పనులను మండల పరిషత్ అభివృద్ధి అధికారి మహేందర్, డి.ఈ.
యు.యు.ఐ.డి.సి. ఎ.ఈ. వినయ్ కుమార్ లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లాకలెక్టర్ మాట్లాడు
తూ ప్రభుత్వం విద్యారంగాన్ని బలో
పేతం చేస్తూ అన్ని ప్రభుత్వ పాఠశాల
లను అభివృద్ధి చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాలల పరి
ధిలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకో
వాలని తెలిపారు.విద్యార్థులతోమాట్లా
డి పాఠశాలలో వారికి కల్పిస్తున్న సౌక
ర్యాలు, మధ్యాహ్న భోజన వివరాల
ను అడిగి తెలుసుకున్నారు. వర్షాకా
లం అయినందున విద్యార్థులకు ఎలాంటి సీజనల్ వ్యాధులు, ఎలర్జీ ఇతర లక్షణాలు కనిపించినట్లయితే వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసు
పత్రిలో వైద్యులను సంప్రదించి వైద్య సేవలు అందించాలని తెలిపారు. ప్రభు
త్వ ఆదేశాల మేరకు మెనూ ప్రకారం సకాలంలో పోషక విలువలు కలిగిన ఆహారం,శుద్ధమైన త్రాగునీటిని అందిం
చాలని, విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని తెలిపారు. మధ్యాహ్న భోజన తయారీ సమయంలో తాజా కూరగాయలు, నిత్యావసర సరుకుల
ను వినియోగించాలని, వంట సిబ్బంది శుభ్రత నిబంధనలు పాటించాలని తెలిపారు. వర్షాకాలం అయినందున పాఠశాల పరిసరాలు,తరగతి గదు
లు, వంటశాల ప్రాంతాలలో పరిశుభ్రత పాటించాలని, వ్యక్తిగత పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించా
లని తెలిపారు. అనంతరం రామ్ నగ
ర్ ప్రాంతంలో చేపట్టిన మండల పరిష
త్ ప్రాథమికోన్నత పాఠశాల భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధి
కారులను ఆదేశించారు. ఈ కార్యక్ర
మంలో సంబంధిత అధికారులు తది
తరులు పాల్గొన్నారు.

Latest