Mahaa Daily Exclusive

  కేజీబీవీలో పురుగుల ఆహారం..!

Share

ఆదిలాబాద్ మ‌హా: జిల్లాలోని నార్నూర్ మండ‌ల‌కేంద్రం కేజీబీవీ స్కూల్‌ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. త‌మ‌కు పెట్టే అల్పహారం,, అన్నంలో పురుగులు ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధ‌ర్నా చేశారు. అన్నంలో పురుగులు ఉన్నాయని ఎన్ని సార్లు చెప్పినా యాజమాన్యం పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇక సమాచారం అందుకున్న ఆదివాసి, లంబాడా సంఘాల నాయకులు పాఠశాలను సందర్శించారు. స్కూల్‌ విద్యార్థులతో మాట్లాడిన నేతలు… మెను ప్రకారం భోజంన పెట్టడం లేదని గుర్తించారు. ఇక కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆరోపించారు. ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఇటు విద్యార్థులు అటు ఆదివాసి, లంబాడా సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. అటు అధికారులు పాఠ‌శాల‌ను సంద‌ర్శించి విచార‌ణ చేప‌ట్టారు.c

Latest