TG: బీఆర్ఎస్ నేతలు బతుకమ్మ కుంటను కబ్జా చేశారని కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు మండిపడ్డారు. ‘కొందరు దుర్మార్గులు గతంలో నాకు డబ్బు, 2 వేల గజాల స్థలం ఆఫర్ చేశారు. కానీ మా అక్కలకు, పెద్దమ్మలకు నేను అన్యాయం చేయనని స్పష్టం చేశాను. బతుకమ్మ కుంటను పునరుద్ధరించాలని గతంలో కేసీఆర్ కు అనేకసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. లండన్, అమెరికా, దుబాయ్ లో బతుకమ్మ ఆడిన కవితకు బతుకమ్మ కుంట కనిపంచలేదు’ అని విమర్శించారు.
Post Views: 77






