బెల్లంపల్లి,మహ : బెల్లంపల్లి పట్టణం
లోని శ్రీ వీర బ్రహ్మేంద్రస్వామి దేవాల
యంలో బుధవారం బెల్లంపల్లి పట్ఝణ విశ్వబ్రాహ్మణ,విశ్వకర్మ సంఘం ఆధ్వ
ర్యంలో శ్రీ విరాట్ విశ్వకర్మయజ్ఞ వేడు
కలను ఘనంగా నిర్వహించారు. కార్య
క్రమంలో భాగంగా బుధవారం నాడు ఉదయం 8గంటలకు స్వామివారికి సుప్రభాత సేవ చేశారు. ఉదయ 9 గంటల సమయంలో ఆలయ సమీపం
లో విశ్వకర్మ పతాక ఆవిష్కరణ చేసి, ధ్వజారోహణం నిర్వహించారు.అనం
తరం బెల్లంపల్లి బజార్ ఏరియాలోని ప్రధాన రహదారులు,పట్టణ పురవీధు
లలో విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ సంఘం నాయకులు, కార్యవర్గ సభ్యులు, కుల బాంధవులు భారీ బైక్ ర్యాలీ తీశారు. ఆలయంలో విశ్వకర్మయజ్ఞం ప్రారంభిం
చి మహా నైవేద్యం, మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వితరణ అనంతరం వెయ్యి మందికి పైగా భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వకర్మల సంఘం పట్టణ అధ్యక్షుడు అక్కనపల్లిసత్యనా
రాయణ తోపాటు ప్రధాన కార్యదర్శి జనం సత్యనారాయణలు మాట్లాడు
తూ సకల వేదం ల ప్రకారం విశ్వకర్మ సృష్టికర్త అని,తన కళానైపుణ్యం ద్వా
రా భారతదేశ విశిష్టతను ప్రపంచానికే చాటిచెప్పిన గొప్ప రూపకర్త అని సం
ఘం నాయకులు తెలిపారు.విశ్వబ్రా
హ్మణ కులస్తులందరూ ఐకమత్యం
గా ఉండి ప్రభుత్వం నుండి రావలసిన హక్కులను సాధించాలని ఆకాంక్షిం
చారు.ఈ కార్యక్రమంలో సంఘం అధ్య
క్షుడు అక్కెనపల్లి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి జన్నం సత్యనారా
యణ,కోశాధికారి శ్రీరామోజు లక్ష్మణ్, గౌరవ అధ్యక్షులు గడ్డం చంద్రమౌళి సభ్యులు పాల్గొన్నారు.






