Mahaa Daily Exclusive

  ఆర్టీసీలో ఉద్యోగాలు డ్రైవర్లు, శ్రామిక్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అక్టోబర్ 8 నుంచి 28 వరకు దరఖాస్తు గడువు..!

Share

హైదరాబాద్‌, మహా: ఆర్టీసీలో డ్రైవర్లు, శ్రామిక్‌ పోస్టుల భర్తీకి తెలంగాణ పోలీసు నియామక మండలి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆర్టీసీలో 1000 డ్రైవర్‌, 743 శ్రామిక్‌ పోస్టులు భర్తీ చేయనున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అక్టోబర్ 8 నుంచి 28 వరకు దరఖాస్తు గడువు తేదీగా నిర్ణయించారు. డ్రైవర్‌ పోస్టులకు 22 నుంచి 35 ఏళ్లు, శ్రామిక్ పోస్టులకు 18 నుంచి 30 ఏళ్ల వయసు వారు అర్హులని తెలిపింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరి వారికి 5 ఏళ్లు, ఎక్స్‌ సర్వీస్‌ మెన్‌ అయితే 3 ఏళ్లు వయోపరిమితి సడలింపు ఉంటుందని బోర్డు తెలిపింది. స్కిల్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేయనున్నట్లు పేర్కొంది. పూర్తి వివరాల కోసం www.tgprb.inలో చూడాలని పోలీసు నియామక మండలి తెలిపింది.

Latest