తన పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన వారికి ప్రధాని నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టారు. ‘దేశ, విదేశాల నుంచి వచ్చిన లెక్కలేనన్ని శుభాకాంక్షలు, ఆశీర్వాదాలు, ఆప్యాయత సందేశాలతో నేను నిజంగా ఉప్పొంగిపోయాను. ఈ ఆప్యాయత నాకు మరింత బలాన్ని చేకూరుస్తుంది. దీనికి నేను ప్రజలకు కృతజ్ఞతలు చెబుతున్నాను’ అని మోదీ ఎక్స్‌లో పేర్కొన్నారు.
Post Views: 25






