తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా రంగంలో సమూల మార్పులకు బుధవారం అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర విద్యా విధానం దేశానికి దిక్సూచిలా ఉండాలని పేర్కొన్నారు. నాణ్యమైన విద్య, ఉపాధి నైపుణ్యాలపై దృష్టి సారించాలన్నారు. ప్రత్యేక విద్యా కార్పొరేషన్ ఏర్పాటు చేసి మౌలిక వసతులు, ప్రమాణాలు మెరుగుపరుస్తామని తెలిపారు. డిసెంబరు 9న ఆవిష్కరించనున్న తెలంగాణ విజన్ డాక్యుమెంట్-2047లో కొత్త విద్యా విధానానికి స్థానం కల్పిస్తామని స్పష్టం చేశారు.
Post Views: 24






